తాజా వార్తలు

Published : 15/06/2021 06:13 IST
రక్తదాతలు ప్రాణదాతలు: కలెక్టర్‌

దాతలను అభినందిస్తున్న శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రక్తదాతలు ప్రాణదాతలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సోమవారం రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో నిర్వహించిన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో స్వచ్ఛంద రక్తదానం చేయడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా యువత ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్లాస్మాదానం చేసిన వారిని అభినందించారు. అనంతరం రెడ్‌క్రాస్‌కు సింగపూర్‌ రెడ్‌క్రాస్‌ అందించిన పది, అమెరికన్‌ సంస్థ అందించిన అయిదు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను కలెక్టర్‌ ప్రారంభించారు. ఆ సంస్థ జిల్లా ఛైర్మన్‌ జగన్‌మోహన్‌రావు, ఇతర సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం రెడ్‌క్రాస్‌ రక్తనిధికి రూ.17.23 లక్షల విలువజేసే ప్లేట్‌లెట్‌ ప్రిపరేటర్‌ యంత్రాన్ని కలెక్టర్‌ ఆ సంస్థ ఛైర్మన్‌ పి.జగన్‌మోహన్‌రావుకు అందజేశారు. దీన్ని జిల్లా మైన్స్‌శాఖ మినరల్‌ ఫౌండేషన్‌ అందజేసిందన్నారు. దీని ద్వారా రక్తం నాణ్యత మరింత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఛైర్మన్‌ సుధీర్‌, కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని