తాజా వార్తలు

Published : 15/06/2021 05:55 IST
కారా ఆదర్శప్రాయుడు

మాస్టారు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మానవహక్కుల సంఘం ప్రతినిధులు, సాహితీవేత్తలు

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: కథా రచయిత, కథానిలయం వ్యవస్థాపకుడు డా.కాళీపట్నం రామారావు(కారా) మాస్టారు జిల్లావాసి కావడం గర్వకారణమని అంతర్జాతీయ మానవహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పప్పల రామ్మోహనరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్‌ కూడలి వద్దగల ఓ ప్రైవేటు హోటల్‌లో ఆ సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో మాస్టారు సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ మాస్టారు మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటన్నారు. కథానిలయాన్ని స్మారక భవనంగా, సాహిత్య పరిశోధనా కేంద్రంగా అభివృద్ధిపర్చాలని, కారా కాంస్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని, రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా జయంతి, వర్ధంతులను నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతర్జాతీయ మానవహక్కుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు జె.జె.మోహన్‌రావు, జిల్లా అధ్యక్షుడు బి.దామోదరరావు, మహిళా అధ్యక్షురాలు పి.వెంకటలక్ష్మి, ప్రధాన కార్యదర్శి డి.పి.దేవ్‌, జి.దామోదరరావు, కారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని