తాజా వార్తలు

Published : 15/06/2021 05:55 IST
తీరంలో సందడి..!
నేటి నుంచి వేటకు గంగపుత్రులు
- న్యూస్‌టుడే, సోంపేట

రెండు నెలల విరామం అనంతరం మంగళవారం నుంచి జిల్లాలో వేటకు వెళ్లేందుకు గంగపుత్రులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటివరకూ భద్రపరిచిన పడవలు, వలలు ఇతర పరికరాలను తీరానికి చేర్చారు. వేకువజామున సముద్రంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలో వ్యవసాయం తర్వాత అధికశాతం మంది ఉపాధి పొందుతున్న రంగం ఇదే. ఓ పక్క వేట నిషేధం, మరోపక్క కరోనా ప్రభావంతో ఇప్పటి వరకు జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా నిషేధం గడువు ముగియడంతో తీరంలో సందడి నెలకొంది.

మత్స్యకారులు, చేపలు విక్రయించే మహిళలు, ఇతర ప్రాంతాలకు రవాణా సాగించే వ్యాపారులు, మత్స్యసంపద కొనుగోలు చేసే దళారులు ఇలా.. తీర ప్రాంతం ఆధారంగా చాలావర్గాల ప్రజలు ఉపాధి పొందుతున్నారు. ఇప్పటివరకూ ఖాళీగానే ఉన్న వీరంతా తాజాగా తీరం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలటంతో మర పడవల ద్వారా వేట సాగించే పరిస్థితి జిల్లాలో లేదు. చిన్న పడవల ద్వారానే వెళ్లే అవకాశాలున్నాయి. సముద్రంలో గాలుల తీవ్రత, కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటున్నందున మర పడవలతో వేట సాగించడం కష్టమని మత్స్యకారులు చెబుతున్నారు. సుమారు వంద నుంచి 150 అడుగుల మేర సముద్రం ముందుకొస్తుంది. దీంతో సముద్రంలో అలజడి అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సెప్టెంబరు వరకు సాధారణ వేట మాత్రమే సాగుతుంది. చిన్న పడవల ద్వారా తీరం దగ్గరలోనే ఉంటూ చిన్న చేపలు మాత్రమే పడుతుంటారు. దీంతో ఈ సమయంలో సిక్కోలు మత్స్యకారులు వేటసాగించేందుకు హార్బర్లు, జెట్టీలు ఉండే ఇతర ప్రాంతాలకు వలసలు సాగిస్తుంటారు.

అక్టోబరు - ఫిబ్రవరి మధ్యనే ఆదాయం..

వేటకు అనుకూల పరిస్థితులు ఉండటంతో పాటు ఎక్కువగా ఆదాయం తెచ్చిపెట్టె మత్స్యసంపద సెప్టెంబరు - ఫిబ్రవరి నెలల మధ్యలోనే అధికంగా దొరుకుతుంది. ఏడాది పాటు జీవనోపాధికి అప్పుడే అవకాశం ఉండటంతో మిగిలిన రోజుల్లో ఎక్కువగా పక్క ప్రాంతాలకు వెళుతుంటారు. జిల్లాలో జెట్టీలు, ఫిషింగ్‌ హార్బర్‌ వంటి సదుపాయాలు లేకపోవడంతో ఆధునిక వేట సాగడం లేదు. దీంతో పరిస్థితులను అంచనా వేసుకొని వేట సాగించాల్సి వస్తోంది. ఆదాయం తెచ్చిపెట్టే సమయాల్లో తుపాన్లు సంభవిస్తే వేట ముందుకు సాగదు. సాధారణంగా జిల్లాలో అక్టోబరు, నవంబరు నెలల్లో తుపాన్లు సంభవిస్తుంటాయి. వాటిని అధిగమిస్తే ఏడాదికి ఆరునెలలే వేట సాగించే పరిస్థితి జిల్లాలో ఉంది.


జిల్లాలో బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో నిర్మించతలపెట్టిన జెట్టీలు అందుబాటులోకి వస్తే వేటకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం పాత విధానంలోనే సాగిస్తుండటంతో ఉపాధి అవకాశాలు మెరుగు పడటం లేదు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులతో ఎక్కువగా మత్స్యకారులు వలసలు సాగిస్తున్నారు. ఆధునిక విధానాలు అందుబాటులోకి వస్తే తీరంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

- మడ్డు రాజారావు, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టరు


జిల్లాలో గల మర పడవలు: ఆరు వేలు ఏటా

లావాదేవీలు: సుమారు రూ.800 కోట్ల వరకు

ఏడూళ్లపాలెంలో వలలు సరిచేసుకుంటూ..

ఆనుకుని ఉన్న మండలాలు: 11

మత్స్యకార గ్రామాలు: 145

వొేటపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కుటుంబాలు: 50 వొేలు

తీర ప్రాంత విస్తీర్ణం: 193 కిలోమీటర్లు

జెట్టీలు అందుబాటులోకి వస్తే....

పరోక్షంగా ఉపాధి: 30 వేలు


Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని