తాజా వార్తలు

Published : 15/06/2021 05:55 IST
వీటికో దారి చూపండి!

అధ్వానంగా మారిన అంతర్రాష్ట్ర రహదారులు..

కనీస మరమ్మతులకు నోచుకోక ప్రయాణికులకు అవస్థలు

ఏయే మండలాల్లో . .

రెండేళ్లుగా ఇదే పరిస్థితి.. ముగితి కృష్ణారావు నాపేరు. కొత్తూరులో మందుల దుకాణం నడుపుతాను. శ్రీకాకుళం, విశాఖ, ఆమదాలవలస రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కొత్తూరు, కొలిగాం రహదారి, గూనభద్ర, ఎన్నిరామన్నపేట వద్ద ఏబీ రోడ్డు బాగోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ఒక్కోసారి ద్విచక్ర వాహనాలు గోతుల్లో పడిపోయి, ప్రమాదాల బారిన పడుతున్నాం. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

రూ.2.4 కోట్లతో ప్రతిపాదించాం

నిర్వహణ లేక.. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై ఏటా నిర్వహణ పనులు చేయాల్సి అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రజల రహదారి కష్టాలను గాలికొదిలేశారు. రెండేళ్లుగా ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. దీనిపై సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రహదారిని మెరుగుపరచాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

●●●వీరఘట్టంలో రహదారి మధ్యన ఏర్పడ్డ గొయ్యి. దానిపై నుంచే వాహనాలు ఇలా రాకపోకలు సాగించాలి..

● భామిని : భామిని, ఘనసర, పెద్దదిమిలి, సింగిడి రహదారి గోతులమమయమైంది.

● కొత్తూరు : కొత్తూరు, పారాపురం కల్వర్టు, గూనభద్ర అప్రోచ్‌, ఎన్నిరామన్నపేట గ్రామాల వద్ద రహదారి దుర్భరంగా మారింది.

● హిరమండలం : పాతహిరమండలం, హిరమండలం గ్రామాల్లో రహదారి స్వరూపమే మారిపోయింది.

● ఎల్‌ఎన్‌పేట : స్కాట్‌పేట, మోదుగవల, ఎల్‌ఎన్‌పేట, కోవిలాం తదితర గ్రామాల వద్ద అధ్వానంగా తయారైంది.

● సరుబుజ్జిలి : రొట్టవలస, మునగవలస, సరుబుజ్జిలి, బప్పడాం, కొత్తకోట తదితర గ్రామాల వద్ద గోతులమయమైంది.

ప్రతిపాదనలు పంపినా..

పాలకొండ పట్టణంలో కార్గిల్‌ కూడలి వద్ద గుంత ఇది.. రాత్రి వేళ వాహనాలు వేగంగా వచ్చి ప్రమాదాలకు గురైన సందర్భాలూ ఉన్నాయి.

దెబ్బతింటున్న వాహనాలు

ఈ దారిని బాగుచేసేందుకు రూ.4 కోట్లతో ప్రపంచ బ్యాంకు నిధుల కోసం ర.భ.శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయినా ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. నిధులు మంజూరు కావడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో. రహదారి మెరుగుపడేదెప్పుడో తెలియని సందిగ్ధావస్థలో సంబంధిత అధికారులున్నారు.

కళింగపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా విజయనగరం జిల్లా పార్వతీపురం (సీఎస్‌పీ) మీదుగా ఒడిశా రాష్ట్రం రాయగడ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి దారుణంగా తయారైంది. జిల్లాలో ఇది 90 కిలోమీటర్ల పొడవున ఉంది. గార, శ్రీకాకుళం, ఆమదాలవలస, బూర్జ, పాలకొండ, వీరఘట్టం మండలాల నుంచి వెళుతోంది. సరకు రవాణా వాహనాలతో పాటు ఇతర వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇప్పుడు ఈ దారిలో కొన్నిచోట్ల వాహనం నడపాలంటే భయపడాల్సిందే.. ముఖ్యంగా పాలకొండ, వీరఘట్టం పట్టణాల పరిధిలో రహదారి మరీ దుర్భరంగా తయారైంది. అడుక్కోగుంత గజానికో గండి అన్నట్లుగా మారింది..

అంతర్రాష్ట్ర రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గోతుల్లో వాహనాలు దిగడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వేగంగా వెళ్ల లేక పెట్రోలు కూడా ఎక్కువగా ఖర్చు అవుతుందని వాహన చోదకులు పేర్కొంటున్నారు.

● వీరఘట్టం మండల పరిధిలో రహదారి 15 కిలోమీటర్ల మేరే ఉన్నా ప్రయాణం ఆద్యంతం నరకమే.. పట్టణంలో దిగువ వీధి కూడలి వద్ద కల్వర్టు కూలిపోయింది. దీంతో మురుగు, వర్షపునీరు ప్రధాన రహదారిపైకి చేరుతోంది. దీంతో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వర్షం కురిస్తే ప్రయాణించడం కష్టమే. సాధారణ రోజుల్లో వాహనాలను గోతుల్లో దించి ఎక్కించాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కాలువ నిర్మాణంతో పాటు సీసీ రహదారి నిర్మాణానికి రూ.25 లక్షలు అత్యవసర నిధులు మంజూరయ్యాయి. గుత్తేదారులు అలసత్వం కారణంగా పనులు ప్రారంభమే కాలేదు. వడ్డివీధి కూడలి, అంబేడ్కర్‌ కూడలి మలుపు వద్ద గుంతలు ఏర్పడ్డాయి.

● పాలకొండ మండలం వీపీ రాజుపేట వద్ద, పాలకొండ పట్టణంలోని కార్గిల్‌, యాలాం కూడళ్ల వద్ద పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. గాయత్రీకాలనీ నుంచి బూర్జ మండలం వరకు రహదారి పూర్తిగా దెబ్బతింది. నిత్యం రద్దీగా ఉండే ఇక్కడ వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు.

● బూర్జ మండలంలో కొండపేట, కొల్లివలస, కెకెరాజపురం గ్రామాల వద్ద సీఎస్‌పీ రహదారి మరమ్మతులకు గురైంది.

ఆమదాలవలస సమీపంలో అలికాం నుంచి రాష్ట్ర సరిహద్దులోని భామిని మండలం బత్తిలి వరకూ (అలికాం - బత్తిలి) రహదారికి ప్రాధాన్యం ఉంది. భామిని, కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, ఆమదాలవలస మండలాలను కలుపుతూ వెళ్లే రహదారి ఇది. 76.5 కి.మీ.పొడవున్న ఈ ఆర్‌అండ్‌బీ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. బస్సులు, లారీలు, ఇతర ప్రైవేటు వాహనాలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. వందలాది గ్రామాలు, వేలల్లో ప్రయాణికులు ఆధారపడ్డ రహదారి ప్రస్తుతం అత్యంత దారుణంగా తయారైంది.

కొత్తూరు వద్ద ఏబీ రహదారి ఇది. చిన్నపాటి వర్షం వస్తే మోకాళ్ల లోతున నీరు నిలుస్తుంది.


జిల్లాలో రెండు కీలక రహదారులు.. సుమారు 166 కిలోమీటర్ల పొడవునా ఉన్నాయి.. 11 మండలాల్లోని దాదాపు అన్ని మండల కేంద్రాల గుండా వెళుతున్నాయి.. వీటిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యమున్న దారులు ప్రస్తుతం అత్యంత దారుణంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే నరకమే కనిపిస్తోంది. బితుకుబితుకు మంటూ ముందుకు సాగుతూ.. ప్రమాదాలకు గురవుతూ ప్రయాణం సాగిస్తున్నారు చోదకులు.. ఏళ్ల తరబడి మరమ్మతులకు గురైనా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పరిసర ప్రాంత ప్రజలు వాపోతున్నారు.

- న్యూస్‌టుడే, వీరఘట్టం, కొత్తూరు


తడిసిమోపెడు అవుతుంది

నా పేరు అధికారి తాతబాబు. మాది వీరఘట్టం మండలం కంబర గ్రామం. మా ఊరు నుంచి వీరఘట్టం మీదుగా పాలకొండ వరకు ఆటో నడుపుతుంటాను. రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ఆటో తరచూ మరమ్మతులకు గురవుతోంది. ఇంజిన్‌ ఆయిల్‌, పెట్రోల్‌ వినియోగం కూడా అధికం అవుతోంది. దీంతో నిర్వహణ ఖర్చు తడిపిమోపెడు అవుతుంది. గతుకుల రహదారిపై ఆటో నడుపుతుండడంతో ఆరోగ్య సమస్యలూ వస్తున్నాయి.

ఏబీ దారిలో కొత్తూరు, హిరమండలం, భామిని మండలాల్లోని కొన్నిచోట్ల రహదారి బాగా లేకపోవడాన్ని గుర్తించాం. కలిగాం రోడ్డు వద్ద వంతెన. పలుచోట్ల రహదారిని పూర్తిస్థాయిలో మెరుగుపరిచాల్సి ఉంది. కొత్తూరులో సీసీ రహదారి, కాలువల నిర్మించాల్సి ఉంది. రూ.2.4 కోట్లతో ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు మంజూరైన వెంటనే మెరుగుపరుస్తాం.

- కిరణ్‌, ఏఈ ఆర్‌అండ్‌బీ, హిరమండలం


నిధులు మంజూరైన వెంటనే..

సీఎస్‌బీ రహదారి మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రహదారి పొడవునా అవసరమైన చోట్ల మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కావాల్సి ఉంది. రెండు, మూడు నెలల్లో రహదారిని మెరుగుపర్చే అవకాశం ఉంది.

- రవినాయక్‌, కార్యనిర్వాహక ఇంజనీర్‌, ర.భ.శాఖ.


 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని