తాజా వార్తలు

Published : 14/06/2021 04:24 IST
టీకాను సద్వినియోగం చేసుకోండి

హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట, న్యూస్‌టుడే: హిరమండలం పీహెచ్‌సీ పరిధిలోని అన్ని గ్రామ సచివాలయాల్లో కొవిడ్‌ టీకా వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి తబ్సమ్‌ఆరా కోరారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ 45 ఏళ్ల వయసు దాటిన వారికి, ఐదేళ్ల వయసు చిన్నారులున్న తల్లులకు మొదటి, రెండో దశ టీకా వేస్తామన్నారు. ● గూనభద్ర సచివాలయం ఆవరణంలో ఆదివారం బాలింతలకు వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని సర్పంచి వాణి ప్రారంభించారు. లబ్బ, గొట్టిపల్లి, ఓండ్రుజోల, మెట్టూరు బిట్‌-1, బిట్‌-2, బిట్‌-3 నిర్వాసితకాలనీ,లు గూనభద్ర, కొత్తూరు, కురిగాం, వసప,.కుంటిభద్ర, కడుము సచివాలయాల పరిధిలో మొదటి, రెండో డోసు వ్యాక్సిన్‌ సోమవారం వేయనున్నట్లు ఎంపీడీవో స్వరూపారాణి తెలిపారు. ● జాగ్రత్తలు పాటిస్తే కొవిడ్‌కు దూరంగా ఉండవచ్చని ఠాగూర్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీస్‌ సొసైటీ అధ్యక్షుడు పెద్దకోట వెంకటరావు పేర్కొన్నారు.

మండలంలో 5 కరోనా కేసులు... నందిగాం, న్యూస్‌టుడే: నందిగాం మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం 5 కరోనా పాజిటివ్‌ కేసులు గుర్తించినట్లు తహసీల్దారు నమ్మి రాజారావు పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో ఇన్‌ఛార్జి ఎంపీడీవో సుధారాణి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని