తాజా వార్తలు

Published : 14/06/2021 04:24 IST
జగన్మాత సేవలో సభాపతి

ఆలయంలో సభాపతి తమ్మినేని సీతారాం దంపతులు

ఇంద్రకీలాద్రి, ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను శాసన సభాపతి తమ్మినేని సీతారాం దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వారిని దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వారికి ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఏఈవో తిరుమలేశ్వరరావు ఆయనకు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని