తాజా వార్తలు

Published : 14/06/2021 04:24 IST
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : ఉప ముఖ్యమంత్రి

ఆర్థిక సాయాన్ని అందిస్తున్న మంత్రి ధర్మాన, తదితరులు

నరసన్నపేట గ్రామీణం, న్యూస్‌టుడే: నరసన్నపేట మండలంలోని ముసిడిగట్టులో ఇటీవల పిడుగు పాటుకు గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన కూర్మాపు లక్ష్మి కుటుంబ సభ్యులకు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ రూ.50 వేల ప్రభుత్వ సాయాన్ని ఆదివారం అందించారు. ఈ సందర్భంగా మృతురాలు భర్త సింహాచలానికి ఆర్థిక సాయాన్ని అందిస్తూ బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు ఆరంగి మురళీధర్‌, బావాజీనాయుడు, దుల్ల రమణ, తదితరులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని