తాజా వార్తలు

Published : 14/06/2021 04:20 IST
అంగన్‌వాడీ కేంద్రానికి కల్తీబియ్యం సరఫరా

కేంద్రానికి సరఫరాచేసిన బియ్యం,

కవిటిగ్రామీణం, న్యూస్‌టుడే : కవిటి మండలం చిన్నకర్రివానిపాలెం అంగన్‌వాడీ కేంద్రానికి కల్తీబియ్యం సరఫరా చేసినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కేంద్రానికి రెండురోజుల క్రితం 50 కిలోల బియ్యం మంజూరైంది. దాన్ని గర్భిణులు, బాలింతలకు శనివారం కార్యకర్త పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఇళ్లకువెళ్లి శుభ్రం చేయగా ప్లాస్టిక్‌ బియ్యంలా ఉన్నట్లు గుర్తించారు. తమకు ఇచ్చిన దాంట్లో 20 శాతం ప్లాస్టిక్‌ బియ్యంలా ఉన్నట్లు తెలిపారు. కొందరు వండి చూస్తే అన్నం ముద్దగా మారింది. నీటిలో బియ్యం వేస్తే కొన్ని గింజలు తేలియాడినట్లు తెలిపారు. గ్రామపెద్దల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రంలో బియ్యం పరిశీలించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఆదేశాల మేరకు లబ్ధిదారుల నుంచి కార్యకర్త ఆ బియ్యం తిరిగి తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పరిసర గ్రామాల అంగన్‌వాడీ కేంద్రాల్లో బియ్యం నాణ్యతపై ఆరా తీయగా తమకు నాణ్యమైన బియ్యం అందినట్లు వారు తెలిపారు.

ఉడికించిన తరువాత ముద్దగా మారిన అన్నం

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని