తాజా వార్తలు

Published : 14/06/2021 04:20 IST
అందుబాటులోకి ఆర్టీసీ సర్వీసులు

పాలకొండ, న్యూస్‌టుడే: ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపు ఇవ్వడంతో ఆర్టీసీ మరికొన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. పాలకొండ కాంప్లెక్సు నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ఉదయం ఆరు నుంచి 10.15 గంటల వరకు ప్రతీ 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని డిపో మేనేజరు సత్యనారాయణ తెలిపారు. విజయనగరానికి ఉదయం 7.15 గంటల నుంచి ఎనిమిది వరకు 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందన్నారు. శ్రీకాకుళం వెళ్లేందుకు ఉదయం ఆరు గంటల నుంచి 11.45 వరకు ప్రతీ 15 నిమిషాలకు ఒక సర్వీసు వేస్తున్నట్లు వివరించారు. పార్వతీపురానికి ఉదయం ఆరు గంటల నుంచి 12.30 వరకు బస్సులు ఉన్నాయి. కొత్తూరు వైపునకు ఉదయం ఆరు గంటల నుంచి 11.30 వరకు 30 నిమిషాలకొక బస్సును అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని