తాజా వార్తలు

Published : 14/06/2021 04:20 IST
చిన్నారుల తల్లులకు వేగంగా టీకా: కలెక్టర్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ రెండో డోసు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను జిల్లాలో త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించారు. ఆదివారం సంబంధిత అధికారులతో టీకా, పరీక్షలపై టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొన్నిచోట్ల అనుకున్న స్థాయిలో జరగడం లేదన్నారు. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ 13 శాతం మంది, 45 ఏళ్ల వయసు దాటినవారు 45 శాతం మంది ఇంకా వేసుకోవాల్సి ఉందన్నారు. తొలుత వీరికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వీరితో పాటు ఐదేళ్ల వయసు లోపు చిన్నారుల తల్లులకు కూడా సోమవారం నుంచి వేగంగా టీకా చేయాలని సూచించారు. పరీక్షలకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని, పూర్తిస్థాయిలో ల్యాబ్‌ల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలన్నారు. మూడో దశపై అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఆక్సిజన్‌కు ఎటువంటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ హోం ఐసొలేషన్‌ ఉన్న రోగులను పరిశీలించాలని, ప్రతిఒక్కరికీ మందులు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని