తాజా వార్తలు

Published : 14/06/2021 04:20 IST
ఆన్‌లైన్‌ తరగతులను సమర్థంగా నిర్వహించాలి

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ పీజీ, డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులను సమర్థంగా నిర్వహించాలని వర్సిటీ ఉప కులపతి నిమ్మ వెంకటరావు అన్నారు. వర్సిటీలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై వర్సిటీ, అనుబంధ కళాశాలల ప్రధానాచార్యులతో వర్చువల్‌ విధానంలో సమావేశం నిర్వహించి అవసరమైన సూచనలు అందించామన్నారు. కొవిడ్‌ పరిస్థితుల్లో తరగతులకు దూరమై ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలని తెలిపామన్నారు. పి.జి. ప్రథమ సెమిస్టర్‌ విద్యార్థులకు ఈ నెల 20లోగా సిలబస్‌ పూర్తి చేసి పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించినట్లు చెప్పారు. రెండో సెమిస్టర్‌ సిలబస్‌ను కూడా జూన్‌ 21 నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు బోధిస్తూ కొనసాగించాలని తెలిపామన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్‌ తమ్మినేని కామరాజు, సీడీసీ డీన్‌ బిడ్డికి అడ్డయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని