తాజా వార్తలు

Published : 14/06/2021 04:20 IST
బయటకు వచ్ఛి. మళ్లీ తోటలోకి..

భామిని మండలం పాతఘనసర-తాలాడ-కోసలి మధ్యన ఐలమ్మతోటలో తిష్ఠ వేసిన ఏనుగులు ఆదివారం మధ్యాహ్నం బయటకు వచ్చాయని అటవీశాఖ బీట్‌ అధికారి కె.దాలినాయుడు తెలిపారు. కోసలి గ్రామం వద్ద వాగు దాటిన తర్వాత ఉన్న ఖాళీ ప్రదేశంలో తిరిగాయని, మళ్లీ తోటలోకి వెళ్లిపోయాయని చెప్పారు. దారిలోని పంట పొలాలపై పడి నాశనం చేశాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వాతావరణం కాస్త చల్లగా ఉండటంతో ఇలా మధ్యాహ్నం వేళ బయటకు వచ్చాయని అంటున్నారు.

-న్యూస్‌టుడే, సీతంపేట

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని