తాజా వార్తలు

Published : 14/06/2021 04:00 IST
ఆక్రమణల చెరలో చీపిగెడ్డ

గెడ్డ గర్భం ఆక్రమించి పంటలు సాగు చేస్తున్న దృశ్యం

మందస, న్యూస్‌టుడే: మందస మండలంలోని ఏజెన్సీ ప్రాంతాలకు సాగునీటి వనరుల్లో ఒకటైన చీపిగెడ్డ పలు చోట్ల ఆక్రమణలకు గురవుతోంది. వరదలు వచ్చినప్పుడు గెడ్డ గర్భంలో ఏర్పడిన మట్టి, ఇసుక మేటలను ఆక్రమించి కొందరు పంటలను సాగు చేస్తున్నారు. చీపి, కొరడాబడి, హొన్నాలి పరిధిలో ఆక్రమిత ప్రదేశాల్లో రాగి, మిరప, కూరగాయలు సాగు చేస్తున్నారు. పంటలకు రక్షణగా కంచె వేస్తున్నారు. ఆ తరువాత తొలగించకుండా వదిలేస్తున్నారు. వరదల సమయంలో అవి అడ్డుపడి ఒడ్డు కోతకు గురవుతోంది. దీంతో కొంతమంది అన్నదాతలు నష్టపోతున్నారు. ఆక్రమణదారులతో తరచూ గొడవలు పడుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గెడ్డలో చోటు చేసుకున్న ఆక్రమణలను తొలగించాలని కోరుతున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని