తాజా వార్తలు

Published : 17/05/2021 05:22 IST
నదిలో మునిగి యువకుడి మృతి

పర్లాఖెముండి, కాశీనగర్‌, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తూ మహేంద్రతనయ నదిలో మునిగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గజపతి జిల్లా గురండి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మచ్చుమర గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. గురండి ఠాణా ఓఐసీ మమతపండా తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం పెద్దమురహరిపురం గ్రామానికి చెందిన బి.బాలకృష్ణ (18) మచ్చుమర గ్రామంలోని బంధువుల ఇంటికొచ్చాడు. ఆదివారం ఉదయం స్నానానికి వెళ్లి నదిలో జారిపడి మునిగిపోయాడు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నదిలోని పెద్దగొయ్యిలో ఉన్న బాలకృష్ణ మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. మృతదేహానికి పర్లాఖెముండి ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎస్సై లోకనాథ్‌బెహర, సీహెచ్‌ కామరాజు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని