తాజా వార్తలు

Published : 17/05/2021 05:17 IST
తల్లికి తలకొరివి పెట్టిన కుమార్తె
తల్లి చితికి నిప్పు పెడుతున్న ఉమ

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురానికి చెందిన వృద్ధురాలు సుగ్గు సరోజినమ్మ(67)కు అయిదుగురూ కుమార్తెలే. కొడుకులు లేరు. కుమార్తెలందరికీ పెళ్లిళ్లు చేశారు. నలుగురూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండగా, చిన్న కుమార్తె ఉమతో ఆమె కలసిఉంటోంది. ఉమ భర్త వలస కార్మికుడు. సరోజినమ్మ అనారోగ్యంతో ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఆదివారం కన్నుమూశారు. ఎవరూ లేకపోవడంతో రోటరీ అంతిమయాత్ర వాహనంలో మృతదేహాన్ని వల్లభరాయగెడ్డ శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. కొడుకులు లేకపోవడంతో తల్లి చితికి ఉమ తలకొరివి పెట్టి తల్లి రుణం తీర్చుకున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని