తాజా వార్తలు

Published : 17/05/2021 05:17 IST
మానవత్వం చాటుకున్న ప్రభుత్వ సిబ్బంది

వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు

వీరఘట్టం గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంటరి మహిళ.. ఎప్పుడు మృతిచెందిందో తెలీదు.. మూడు రోజులుగా ఇంటి తలుపు తెరుచుకోలేదు. అనుమానం వచ్చిన స్థానికులు పార్వతీపురంలో ఉన్న కూతురికి సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చి తలుపుతీసి చూస్తే ఏముంది.. అప్పటికే తల్లి మృతిచెంది ఉండడంతో బోరున విలపించింది. ఘటన వీరఘట్టంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని జూనియర్‌ కళాశాల సమీపం సీఎస్‌పీ రహదారి పక్కగా ఓ రేకుల షెడ్డులో డొంకాడ పార్వతి(55) ఉంటున్నారు. మూడు రోజుల నుంచి ఇంటి తలుపు మూసి ఉండటంతో ఇరుగుపొరుగువారు కుమార్తెకు తెలియజేశారు. ఆమె వచ్చాక విషయం బయటపడింది.

స్పందించిన అధికారులు: మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానికులెవరూ సహకరించలేదు. దీంతో ఆమె అధికారులకు సమాచారమిచ్చింది. స్పందించిన మండల అధికారులు అక్కడికి చేరుకొని మృతిపై విచారించారు. ప్రభుత్వ వైద్యుల సూచనల మేరకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మండల అధికారుల ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు మృతదేహాన్ని వాహనంలో శ్మశాన వాటికకు తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సిబ్బంది, ప్రతాప్‌, శ్రీను, మజ్జి, ప్రసాద్‌, బాబురావు, పారిశుద్ధ్య కార్మికుల పార్వతి కూతురు కృతజ్ఞతలు తెలిపారు. వారిని అందరూ అభినందించారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని