తాజా వార్తలు

Published : 17/05/2021 04:57 IST
విధుల్లో నిర్లక్ష్యం వహించినవారిపై వేటు

జిల్లాలో 9 మంది వాలంటీర్ల తొలగింపు

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో చేపట్టిన ఆరో విడత ఫీవర్‌ సర్వేలో నిర్లక్ష్యం వహించిన 9 మంది వాలంటీర్లను తొలగిస్తున్నట్లు జేసీ డా.కె.శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేలో అన్నీ తప్పులతో నివేదికలు సమర్పించిన వాలంటీర్లపై వేటు వేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెక్కలి 5వ సచివాలయ పరిధికి చెందిన దండాసి డిల్లీశ్వరరావు, దాసరి భారతి, దేవాది రామకృష్ణ, తోట వెంకటేశ్‌, బొడ్డు తులసి, గండి రాజారెడ్డి, రణస్థలం మండలం నారువ సచివాలయ వాలంటీర్లు పడగల రమణ, భామిని మండలం బాలేరు 2 సచివాలయం వాలంటీరు రాజారావు, లావేరు మండలం గుమడ వాలంటీరు గంగవరపు అప్పారావును తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని కోరారు. కొందరు క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారని, అలా చేసినందుకు 9 మందిని తొలగించినట్లు చెప్పారు. మండల సర్వేలైన్స్‌ అధికారులు పరిస్థితులను గమనించాలని సూచించారు. తప్పుడు నివేదికలు ఇస్తే ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని