తాజా వార్తలు

Published : 17/05/2021 06:14 IST
ఆక్రమిస్తే.. ఊరుకోం
కొత్తకర్రచెరువులో ఆక్రమణలను తొలగిస్తున్న పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది

నరసన్నపేట, న్యూస్‌టుడే: నరసన్నపేట మేజర్‌ పంచాయతీ పరిధిలో పలు చెరువుల్లోని ఆక్రమణలను ఆదివారం రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది తొలగించారు. విలువైన చెరువు స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, కబ్జాలు చోటు చేసుకుంటున్న వైనంపై ‘ఈనాడు’లో ఆదివారం ‘చెరువును చూసి.. ఆక్రమించేసి’ శీర్షికన వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. నరసన్నపేటలోని చరమాల, గోరువాని, పాలకర్ర, కొత్తకర్ర, జలగల చెరువుల ఆక్రమణలపై రెవెన్యూ, పంచాయతీ యంత్రాంగం కొరడా ఝుళిపించింది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు శాఖలకు చెందిన సిబ్బంది ఆయా ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించారు. తహసీల్దార్‌ ప్రవల్లికప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అన్వేష్‌, ఈవో మోహన్‌బాబు, వీఆర్వో అప్పలనాయుడు, రాజారావు, శరణ్య, సర్వేయర్‌ తాతబాబు, అఖిల, తదితరులు పాల్గొన్నారు. యంత్రాలతో తొలగించాల్సిన వాటిని పక్కనబెట్టి ఇతరత్రా ఆక్రమణలను తొలగించారు. అయితే ఇంకా కొన్ని ఉన్నాయని, వాటిని తొలగించాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని