తాజా వార్తలు

Published : 23/04/2021 03:32 IST
రెప్పపాటులో కాటేసిన మృత్యువు

బస్సు ఢీకొని వ్యక్తి మృతి

రామచంద్ర (పాత చిత్రం)

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: రెప్పపాటు కాలంలో మృత్యువు ఆ యువకుడిని బస్సు రూపంలో కబళించింది. జాతీయ రహదారిపై కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా, ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఎస్‌ఐ వై.రవికుమార్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తిలారుకు చెందిన యువకుడు బడారి రామచంద్ర(35) వీఆర్‌ఏ అయిన తన తల్లి సెలవులో ఉండటంతో కొంతకాలంగా ఆ సేవలు నిర్వహిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో కొవిడ్‌ కిట్లను తీసుకునేందుకు ద్విచక్ర వాహనంపై తహసీల్దారు కార్యాలయానికి వచ్చాడు. తిరిగి వెళుతుండగా పెద్దబమ్మిడి వీఆర్‌ఏ నీలమ్మను గ్రామంలో దింపేసి వెళ్దామని బయలుదేరాడు. నరసన్నపేటవైపు వెళుతుండగా ఎత్తురాళ్లపాడు వద్ద అదే మార్గంలో వెళుతున్న టూరిస్టు బస్సు బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో రామచంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్ర వాహనాన్ని బస్సు చాలా దూరం ఈడ్చుకొని వెళ్లింది. తీవ్రంగా గాయపడిన నీలమ్మను స్థానికులు నరసన్నపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు రామచంద్ర మృతదేహాన్ని కోటబొమ్మాళి తరలించి, దర్యాప్తు చేపట్టారు. సంఘటనా ప్రాంతాన్ని తహసీల్దార్‌ మధుబాబు పరిశీలించారు. రామచంద్రకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని