తాజా వార్తలు

Published : 08/04/2021 05:18 IST
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య


నారాయణరావు (దాచిన చిత్రం)

కొసమాల(మెళియాపుట్టి), న్యూస్‌టుడే: మెళియాపుట్టి మండలంలోని కొసమాల గ్రామానికి చెందిన రైతు సలాన నారాయణరావు(53) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు... నారాయణరావు ఇటీవల కొందరి వద్ద అప్పులు చేశాడు. అవి పెరిగిపోయి చెల్లించేందుకు ఇబ్బందిపడుతుండేవాడు. దీనిపై తీవ్ర ఆందోళనకు గురైన నారాయణరావు బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే మెళియాపుట్టి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రథఫమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం టెక్కలి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణరావుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని