గురువారం, ఆగస్టు 06, 2020

తాజా వార్తలు

మట్టిలో దాచి.. గుట్టుగా అమ్మకాలు

మార్టూరు, అద్దంకి న్యూస్‌టుడే : తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం సీసాలను మట్టిలో దాచి అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని సెబ్‌ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం అద్దంకి కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ బి.శ్రీనివాసులు వివరాలను వెల్లడించారు. మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన దామర్ల శ్రీనివాసరావు ఇంటి ఆవరణలో తెలంగాణ మద్యం సీసాలను పూడ్చిపెట్టాడు. నమ్మకమైన వారికి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. సమాచారం అందుకున్న సెబ్‌ అధికారులు అదివారం ఉదయం శ్రీను ఇంటికి వెళ్లారు. అదే సమయంలో జె.పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామానికి చెందిన గోలి ఆంజనేయులుకు విక్రయించిన పది సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని విచారించగా మద్యం సీసాలను పెరటి ఆవరణలో పూడ్చిపెట్టినట్లు గుర్తించారు. తవ్వి వాటిని కూడా బయటకు తీయించారు. మొత్తం 15 మద్యం సీసాలను, వాటిని తరలించేందుకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. ఆయన వెంట ఎస్‌ఐలు ఎస్‌.ఆంజనేయులు, పీ.మహబూబ్‌భాషా, సిబ్బంది ఉన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని