తాజా వార్తలు

Updated : 22/07/2021 09:55 IST
ఫోన్‌ ట్యాపింగ్‌లు దారుణం: మల్లు రవి

హైదరాబాద్‌: శాంతియుత నిరసనలు చేస్తుంటే అరెస్టులు చేయడం అన్యాయమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధ్వజమెత్తారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడంతో పాటు గోప్యతను బట్టబయలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్‌లు చేయడం దారుణమన్నారు. ఇంధన ధరలను అడ్డగోలుగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న నేపథ్యంలో ఇటీవల నిరసన తెలియజేస్తే.. అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు ఉంటుందని.. పాలకులు హరిస్తుండటాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేసి ఇందిరా పార్కు వద్ద ఇవాళ జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేలా అవకాశం కల్పించాలని కోరారు. పెగాసస్‌ వ్యవహారంలో భాగంగా ఏఐసీసీ ఇవాళ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం నిర్వహించాలని.. గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇందిరాపార్కు వద్ద నిరసనకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు ముఖ్య నాయకులు బయటకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని