తాజా వార్తలు

Published : 19/06/2021 02:03 IST
అర్హులకు త్వరలో రేషన్‌కార్డుల జారీ!

గ్రేటర్‌లోనే అధికశాతం దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: అర్హులకు రేషన్‌కార్డులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల నుంచే అధికశాతం అర్జీలు వచ్చినట్టు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కొత్త రేషన్‌కార్డుల జారీ, ధాన్యం సేకరణపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ నుంచి పాలనాధికారి శ్వేతామహంతి అధికారులతో కలసి పాల్గొన్నారు. గ్రేటర్‌ పరిధిలో ఎక్కువగా దరఖాస్తులు రావటంతో పురపాలక, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సమన్వయంతో పరిశీలన పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. అద్దె ఇళ్లల్లో ఉండేవారి వివరాలను సేకరించి వారిలో అర్హులకు కార్డులు అందజేయాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ త్వరలోనే లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపుతామన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని