తాజా వార్తలు

Published : 19/06/2021 01:38 IST
మిలటరీ ఆసుపత్రిలో ప్రత్యేక ఆక్సిజన్‌ ప్లాంటు
ప్లాంటును ప్రారంభిస్తున్న బీడీఎల్‌ సీఎండీ సిద్ధార్థ్‌ మిశ్రా

ఈనాడు, హైదరాబాద్‌ : కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) సికింద్రాబాద్‌లోని మిలటరీ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. నిమిషానికి 960 లీటర్ల ప్రాణవాయువును ఇది ఉత్పత్తి చేస్తుంది. ఇది దాదాపు 220 సిలిండర్ల వరకు సమానం. కరెంట్‌ పోయినా, యూనిట్‌లో ఏదైనా సమస్య వచ్చినా ఆక్సిజన్‌ ఉత్పత్తి ఆగకుండా సెకండరీ ఆక్సిజన్‌ను సరఫరా చేయడం ప్లాంట్‌ ప్రత్యేకత. బీడీఎల్‌ సీఎండీ సిద్దార్థ్‌ మిశ్రా, దక్షిణ భారత జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌(జీవోసి) లఫె్టినెంట్‌ జనరల్‌ ఎ.అరుణ్‌ తిరుమలగిరిలోని మిలటరీ ఆసుపత్రిలో శుక్రవారం ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దార్థ్‌ మిశ్రా మాట్లాడుతూ.. త్వరలో కింగ్‌కోఠి, కొండాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి, ఈఎస్‌ఐ ఆసుపత్రిలోనూ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర ఏరియా జీవోసీ లఫె్టినెంట్‌ జనరల్‌ ఆర్‌.కె.సింగ్‌, బీడీఎల్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని