తాజా వార్తలు

Published : 19/06/2021 00:47 IST
పరిశుభ్రతతోనే ఆరోగ్యం: డీపీఓ

మన్నెగూడలో వివరాలు తెలుసుకుంటున్న అధికారిణి రిజ్వానా

పూడూరు, న్యూస్‌టుడే: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానాబేగం పేర్కొన్నారు. మన్నెగూడ కూడలిని ఆమె శుక్రవారం సందర్శించారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతుండటంతో సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా తడి, పొడిచెత్త సేకరణపై ఆరా తీశారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్మికులకు సహకరించి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. నర్సరీల్లో మొక్కల నిర్వహణ, హరితహారం ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని