తాజా వార్తలు

Updated : 14/05/2021 18:17 IST
MP రఘురామకృష్ణరాజు అరెస్టు

హైదరాబాద్‌: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసింది.  ఆయనపై 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు ఎంపీ రఘురామ భంగం కలిగించారని సీఐడీ అభియోగం మోపింది.. భార్య రమాదేవి పేరిట నోటీసులు ఇచ్చింది. ఎంపీ రఘురామను పోలీసులు విజయవాడ తరలిస్తున్నారు.

పుట్టిన రోజు నాడే తన నాన్నను అరెస్టు చేశారని రఘురామ కుమారుడు భరత్‌ అన్నారు. ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగి మూడు నెలలే అయ్యిందని అన్నారు. మఫ్టీలో వచ్చింది సీఐడీ అధికారులా.. రౌడీలా అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు. ‘ ముందస్తు ప్రణాళిక ప్రకారం అకస్మాత్తుగా వచ్చి మా మాన్నను తీసుకెళ్లారు. వై కేటగిరీ భద్రత ఉన్న ఎంపీని బలవంతంగా తీసుకెళ్లారు. న్యాయవాదితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఎంపీని ఎలా అరెస్టు చేస్తారు? ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? మా నాన్నను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు.’’ అని భరత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు.


 


ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని