తాజా వార్తలు

Updated : 14/05/2021 17:10 IST
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌: జంటనగరాల్లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.. హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, నాగోలు, తార్నాక, పటాన్‌చెరు, లంగర్‌హౌస్‌, కార్వాన్‌, గోల్కొండ, మెహదీపట్నం, మలక్‌పేట, దిల్‌సుఖ్‌ నగర్‌, చైతన్యపురి, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీగా కురిసిన వర్షానికి నాలాలు పొంగుతున్నాయి. సికింద్రాబాద్‌, బేగంపేట, ప్యారడైస్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్‌, చిలకలగూడ,మారేడ్‌పల్లిలోనూ విపరీతంగా వర్షం కురుస్తోంది. ఘట్‌కేసర్‌ మండలం ఏదులాబాద్‌ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయాయి.ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లో వర్షం కురిస్తే చాలా చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగేది. కానీ, ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వడంతో అలాంటి సమస్యలేవీ ఏర్పడలేదు.


ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని