తాజా వార్తలు

Updated : 14/05/2021 13:03 IST
మానవీయకోణంలో ఆలోచించాలి: రేవంత్‌

హైదరాబాద్‌: రాష్ట్ర సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లను నిలిపేయడం సరికాదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మానవీయ కోణంలో ఆలోచించాలని సూచించారు. తక్షణమే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని రేవంత్ కోరారు.

కేసీఆర్‌ తక్షణమే స్పందించాలి: నారాయణ

సరిహద్దులో ఆస్పత్రి అనుమతి పత్రం చూపించినా అంబులెన్స్‌లను పోలీసులు విడిచిపెట్టడం లేదని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ఖాళీ అంబులెన్స్‌లను కూడా నిలిపేస్తున్నారని ఆక్షేపించారు. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ తక్షణమే స్పందించాలని ఆయన కోరారు.

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని