తాజా వార్తలు

Updated : 14/05/2021 12:32 IST
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా విజృంభణ: ఉత్తమ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా విజృంభిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో టెస్టింగ్‌ కిట్లు లేకపోవడం దారుణమని ఆక్షేపించారు. కరోనా రోగులకు సేవలందించేందుకు గాంధీభవన్‌లో రాహుల్‌గాంధీ కేర్‌ కార్యక్రమాన్ని ఉత్తమ్‌ ప్రారంభించారు. దీని ద్వారా ప్లాస్మా, రక్తదానం, ఆక్సిజన్‌ సమకూర్చున్నట్లు చెప్పారు. యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌రోగులకు అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. 

కొవిడ్‌పై రాష్ట్రంలో ఎలాంటి నియంత్రణ లేదని ఉత్తమ్ విమర్శించారు. చాలా చోట్ల టెస్టుల కోసం ఆయా కేంద్రాల వద్ద నాలుగైదు గంటలు వేచి ఉంటున్నారని.. వచ్చిన వారిలో వంద మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేసి పంపిస్తున్నారని ఆరోపించారు. ‘‘104, 108 సేవలను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఆస్పత్రుల దోరపిడీపై చర్యలు తీసుకోవడం లేదు. ఆరోగ్యశ్రీలో కొవిడ్‌ చికిత్సను ఇప్పటి వరకు చేర్చలేదు. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి ధ్యాస లేదు. కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక రోగులు చనిపోతే సీఎం బాధ్యత వహించాల్సి అవసరం లేదా?’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని