తాజా వార్తలు

Published : 14/05/2021 05:28 IST
మనోవేదనతో వివాహిత ఆత్మహత్య


రజిత

పాపన్నపేట (మెదక్‌ టౌన్‌) న్యూస్‌టుడే: తల్లి మరణంతో మానసికంగా కుంగిపోయి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పాపన్నపేట మండలం కొడపాకలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాపన్నపేట ఎస్‌ఐ సురేష్‌ గురువారం తెలిపిన వివరాలు.. కొల్చారం మండల పరిధి యెనిగండ్ల గ్రామానికి చెందిన మల్లేశానికి కూతురు, కొడుకు ఉండగా కుమార్తె రజితను (20) మూడేళ్ల కిందట పాపన్నపేట మండలం కొడపాకకు చెందిన చిన్నబయనోళ్ల నవీన్‌కు ఇచ్చి వివాహం చేశారు. కూతురు వివాహం తర్వాత భార్య నింగమ్మ అనారోగ్యంతో చనిపోయింది. తల్లి మరణంతో మానసికంగా కుంగిన రజిత నన్ను అమ్మ పిలుస్తోందంటూ హడావిడి చేస్తుండేది. పలుమార్లు వైద్యుల వద్ద కౌన్సిలింగ్‌ ఇప్పించినా మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈనెల 12న సాయంత్రం కొడపాకలోని వారి ఇంట్లో 6.30 గంటలకు ఎవరు లేనిది చూసి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. భర్త నవీన్‌ ఇంటికి వచ్చి చూడగా పూర్తిగా కాలిపోయి అప్పటికే మరణించింది. సమాచారం అందుకున్న పాపన్నపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన వివాహితకు ఒకటిన్నర సంవత్సరం వయసున్న కుమారుడు రితీష్‌ ఉన్నాడు. ఆమె తండ్రి మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని