తాజా వార్తలు

Published : 14/05/2021 05:28 IST
వడదెబ్బతో వృద్ధుడు మృతి


మహ్మద్‌ ఖయ్యూం

వెల్దుర్తి, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో నుంచి వెళ్లిన వృద్ధుడు వడదెబ్బ బారిన పడి చనిపోయిన ఘటన మండలంలోని శెట్టిపల్లి కలాన్‌లో గురువారం చోటు చేసుకుంది. వెల్దురి ఎస్‌ఐ మహేందర్‌ తెలిపిన వివరాలు.. మెదక్‌ పట్టణం ఆటోనగర్‌కు చెందిన మహ్మద్‌ ఖయ్యూం (60) కుటుంబ సభ్యులతో జరిగిన గొడవతో అలక వహించి మండలంలోని శెట్టిపల్లి కలాన్‌ గ్రామానికి చేరుకున్నాడు. రెండు రోజులుగా గ్రామంలో తిరుగుతుండగా గ్రామస్తులు పెట్టిన అన్నం తిని రాత్రి ఎక్కడో నిద్రించేవాడు. గురువారం ఉదయం గ్రామం సమీపంలోని పొలంలో చనిపోయి కనిపించగా రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వృద్ధుడి చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో చూసిన కుటుంబ సభ్యులు వెల్దుర్తి పోలీసులను సంప్రదించారు. వారి సూచనతో వెల్దుర్తి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వడదెబ్బతో చనిపోయి ఉంటాడని వెల్దుర్తి ఎస్‌ఐ వివరించారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని