తాజా వార్తలు

Published : 14/05/2021 05:28 IST
మరణంలోనూ వీడని బంధం

భార్య చనిపోయిన గంటలోనే భర్త మృత్యువాత

చాంద్‌బీ

న్యూస్‌టుడే, తూప్రాన్‌: అనారోగ్యంతో బాధపడుతున్న భార్య చనిపోయిందన్న చేదు నిజాన్ని భరించలేక గంట వ్యవధిలో భర్త సైతం గుండెపోటుతో అనంతలోకాలకు చేరిన విషాద ఘటన తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మహ్మద్‌ ఇమామ్‌ (75), చాంద్‌బీ (70)లు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా వారికి ఒక కొడుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా చాంద్‌బీ అనారోగ్యంతో బాధపడుతుండగా గురువారం పరిస్థితి విషమించగా మధ్యాహ్నం చనిపోయింది. భార్య చనిపోయిందన్న వార్త విన్న భర్త ఇమామ్‌ గుండెపోటు బారిన పడి గంటలో చనిపోయాడు. కరోనా లక్షణాలతో చనిపోయారనే అనుమానంతో సర్పంచి లంబ వెంకటమ్మ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు పూర్తి చేశారు. బాధిత కుటుంబానికి సర్పంచి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.

ఇమామ్‌

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని