తాజా వార్తలు

Updated : 14/05/2021 05:39 IST
సమాజ హితం కోరి.. ఈద్‌ నమాజ్‌

 

వెల్దుర్తి, న్యూస్‌టుడే: ముప్పై రోజుల పాటు చెడు వినొద్దు, కనొద్దు, అనొద్దు సంప్రదాయాన్ని పాటిస్తూ రోజాలతో గడిపిన ముస్లింలు నేడు ఈద్‌-ఉల్‌-ఫితర్‌ చేసుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈద్‌ నమాజ్‌ చేసుకోవాలని మత పెద్దలు సూచిస్తున్నారు. ఇళ్లలోనే నమాజ్‌ ఆచరించాలని చెబుతున్నారు. మసీదుల్లో కేవలం నలుగురైదుగురు మాత్రమే ఈద్‌ నమాజ్‌ ఆచరించేందుకు అవకాశం ఉంది. ఇబ్బందులు తలెత్తినప్పుడు వాటి నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు పాటించడం కూడా ముఖ్యమేనని మహ్మద్‌ ప్రవక్త ప్రవచించారని గుర్తు చేస్తున్నారు. తమ ప్రవర్తన వల్ల ఇతరులను ఇబ్బందులకు గురి చేయడం పాపమేనని, మూర్ఖత్వం అవుతుందని చెప్పారు. సమాజ హితం కోరి ప్రభుత్వాలు విధించే నిబంధనలు పాటించడం ప్రతి ముస్లిం విధి అని హదీస్‌ చెబుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎప్పుడైనా ఈద్‌ నమాజ్‌ ఆచరించవచ్ఛు ఈద్గాలకు వెళ్లడం నిషేధం. కుటుంబ సభ్యులతో ఇళ్లలో సంతోషంగా చేసుకోవాలని చెబుతున్నారు. ఆలింగనాలు కూడా క్షేమకరం కాదంటున్నారు. సలాం చెప్పడంతోనే శుభాకాంక్షల పర్వాన్ని ముగించడం మంచిదని సూచిస్తున్నారు. సాంకేతికత ఆధారంగా చరవాణి ద్వారా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు పంపొచ్చని చెప్పారు. ఈద్‌ ముబారక్‌ తెలపడానికి ఇతరుల ఇళ్లకు వెళ్లడం కూడా కూడదంటున్నారు.


ఐకమత్యానికి ప్రతీక..

రంజాన్‌ పండగ సోదర భావం, సామరస్యం, సహ జీవనం, ఐకమత్యానికి ప్రతీక అని చిత్రకారుడు రుస్తుం అన్నారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేటలో గురువారం ఈద్‌-ఉల్‌-ఫితర్‌ ముబారక్‌ చిత్రాన్ని రుస్తుం ఆవిష్కరించారు. పేదలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నహీంరుస్తుం, జులేఖరుస్తుం, రిజ్వానాబేగం తదితరులు ఉన్నారు.

- సిద్దిపేట అర్బన్‌

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని