తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
కరోనాతో చికిత్స పొందుతూ టీపీపీసీ కార్యదర్శి మృతి

నర్సాపూర్‌, కొల్చారం, న్యూస్‌టుడే: కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన టీపీసీసీ కార్యదర్శి సోమన్నగారి లక్ష్మి (45) కరోనాతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారు. ఆమెకు కరోనా నిర్ధారణ కావడంతో నాలుగు రోజుల పాటు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కూకట్‌పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో పది రోజుల క్రితం చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి గుండెపోటుతో కన్ను మూశారు. భర్త రవీందర్‌రెడ్డి కూడా కరోనాతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో సోమన్నగారి లక్ష్మి క్రియాశీలకంగా పాల్గొన్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో తెరాస తరఫున టికెట్‌ ఆశించగా అధిష్ఠానం ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి కేటాయించింది. దీంతో నిరాశ చెందిన ఆమె బీఎస్పీ తరఫున ఏనుగు గుర్తుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతర పరిణామాల్లో ఆమె టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన ఆమె హైదరాబాద్‌ సమీపంలోని మియాపూర్‌లో స్థిరపడ్డారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని