తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
కరోనాతో నిజాం కళాశాల అధ్యాపకురాలు మృతి


డా.కవిత

నారాయణగూడ, న్యూస్‌టుడే: కొవిడ్‌ మహమ్మారి నిజాం కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకురాలు డా.కవిత(43)ను పొట్టనపెట్టుకుంది. ఏప్రిల్‌ 26న ఆమెకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి మందులు వాడారు. తర్వాత ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా తమ అమ్మానాన్నలు కూడా కొవిడ్‌ బారినపడ్డారు. ఆమె తండ్రి రాందాస్‌(75) కొవిడ్‌తో పోరాడి చనిపోయారు. ఇంతలో కవిత ఆరోగ్యం కూడా క్షీణించడంతో అల్వాల్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. పూర్తిగా కోలుకోవడంతో డిశ్ఛార్జ్‌ చేశారు. గత సోమవారం ఉన్నట్టుండి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మృతి చెందారు. ఆమె తల్లి విజయలక్ష్మి ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని