తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
యశోద ఫౌండేషన్‌ వితరణ


గ్రామాల్లో పోలీసుల చేతుల మీదుగా ఆదివాసీలకు మాస్కులు ఇస్తున్న ఫౌండేషన్‌ ప్రతినిధులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ నియంత్రణ కోసం రాష్ట్రంలోని ఆది వాసీలకు యశోద ఫౌండేషన్‌ మాస్కులను పంపిణీ చేసింది. ప్రస్తుతం కరోనా తీవ్రత నేపథ్యంలో.. యశోద హాస్పిటల్స్‌ గ్రూప్‌లో భాగమైన యశోద ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ తన వంతు బాధ్యతగా ఆదివాసీలు, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండే కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని మాంగ్లి, పంగిడిమదర, రోంపల్లి, గుండాల, గుడిపేట గ్రామాల ప్రజలకు మాస్క్‌లు పంపిణీ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల మహిళ స్వయం సహాయక బృందాలకు ఆర్థికంగా మద్దతునివ్వడంలో భాగంగా వారితో ఆరు వేల వస్త్ర మాస్క్‌లను తయారు చేయించామని యశోద హాస్పిటల్స్‌ డైరెక్టర్లు, డా.అభినవ్‌ గోరుకంటి, డా.పవన్‌ గోరుకంటి పేర్కొన్నారు. టీకాలు వేసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరూ మాస్క్‌లు వాడాలని వారు అభ్యర్థించారు. అదివాసీ ప్రజలకు మాస్కుల పంపిణీలో పోలీసులు, స్వయం సహాయక బృందాలు ఎంతో సహకరించాయంటూ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని