తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
తెలంగాణ ఉద్యమకారిణి శాంతా శ్రీవాత్సవ మృతి

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే : తెలంగాణ ఉద్యమకారిణి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు శాంతా శ్రీవాత్సవ(78) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. పాతబస్తీ శాలిబండ లాల్‌దర్వాజా మోడ్‌ ప్రాంతానికి చెందిన శాంతా శ్రీవాత్సవ 1969లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పీసీసీ అద్యక్షుడిగా ఉన్నప్పుడు శాంతా శ్రీవాత్సవ పీసీసీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అనారోగ్యానికి గురైన ఆమె కొన్ని రోజులుగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఆమెకు భర్త, కుమార్తె ఉన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని