తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
కొవిడ్‌ను జయించిన యోధుల సేవలు అవసరం


ప్లాస్మా దాతలను సత్కరిస్తున్న కమిషనర్‌ అంజనీకుమార్‌, ఇతర అధికారులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: కరోనా వైరస్‌తో బాధపడుతున్న పేదలకు రక్తం, ప్లాస్మా దానం చేసేందుకు కొవిడ్‌ను జయించిన యోధులు ముందుకు రావాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌(హెచ్‌సీఎస్‌సీ), హైదరాబాద్‌ నగర పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నగర పోలీసు కమిషనరేట్‌లోని సభా మందిరంలో ప్లాస్మా దాతలను సత్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కొవిడ్‌ను జయించిన ప్రతీ ఒక్కరూ ఆపదలో ఉన్న కొవిడ్‌ బాధితుడి ప్రాణాలను కాపాడేందుకు ప్లాస్మా దానం చేయాలని కోరారు. అదనపు డీసీపీ(షీ టీమ్స్‌ అండ్‌ భరోసా) శిరీషా రాఘవేంద్ర, హెచ్‌సీఎస్‌సీ అసోసియేట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌, అసోసియేట్‌ అడ్మిన్‌ మహ్మద్‌ నజ్ముద్దీన్‌, ఏసీపీ పీజీ రెడ్డి, రాజావెంకటరెడ్డి(ఐటీసెల్‌), చాంద్‌పాషా, అశోక్‌ పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని