తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
పిలిచినా రాలేదని.. చితక్కొట్టారు


యువకుడిని కర్రతో కొడుతున్న వ్యక్తి

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: పిలిస్తే రాలేదని ఓ యువకుడిని భవన యాజమాని తన సోదరుడితో కలిసి చితకబాదారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. మల్లాపూర్‌ డివిజన్‌ ఎస్వీనగర్‌కు చెందిన షేక్‌ నజీమ్‌ ఈనెల 8న మల్లాపూర్‌ సాయిగార్డెన్స్‌ వద్ద ఉన్న వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి వెళ్తున్నాడు. ఆ పక్కనే ఉన్న భవనం యజమాని భిక్షపతి గౌడ్‌ నజీమ్‌ను పిలిచాడు. వెంటనే రాలేదన్న ఆగ్రహంతో కర్ర తీసుకుని చితకబాదాడు. ఈలోగా ఆయన సోదరుడు కూడా వచ్చి ఇద్దరు కలిసి అదే భవనంలోని మిఠాయి దుకాణంలోకి తీసుకెళ్లి మరోమారు దాడి చేశారు. అందరూ చూస్తుండగానే కర్రలతో కొట్టడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నజీమ్‌ చేతికి తీవ్రగాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు యువకులు చరవాణిలో వీడియో తీశారు. గురువారం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాక ఈవిషయం వెలుగుచూసింది. నాచారం సీఐ కిరణ్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా బాధితుడు నజీమ్‌ సోమవారం ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని