తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
అర్ధరాత్రి జోరువాన!

దెబ్బతిన్న ఫీడర్లు.. నిలిచిన విద్యుత్తు సరఫరా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఉరుములు, మెరుపులతో అర్ధరాత్రి నగరం ఉలిక్కిపడింది. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రాజధాని పరిధిలో జోరువాన దంచికొట్టింది. పలు చెట్ల కొమ్మలు విరిగిపడటం, ఫీడర్లు మరమ్మతులకు గురవడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నడి నిద్రలో ఫ్యాన్లు, ఏసీలు బందవడంతో నగరవాసులకు ఇక్కట్లు తప్పలేదు. ముఖ్యంగా చార్మినార్‌, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌ సర్కిళ్ల పరిధిలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల రోడ్లపై విరిగిపడిన చెట్ల కొమ్మలను డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తొలగించారు. గురువారం సైతం పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి.

కూలీల్లేక మధ్యాహ్నం దాకా!

ఇందిరాపార్కు, టోలిచౌకి, గుడిమల్కాపూర్‌, గోల్కొండ, గోల్నాక, నాంపల్లి, ఏఎస్‌ఆర్‌రాజునగర్‌ ప్రాంతాలకు సరఫరా చేసే 27 ఫీడర్లు, బంజారాహిల్స్‌ సర్కిల్‌లో 14 ఫీడర్లు, సికింద్రాబాద్‌ సర్కిల్‌లో 4, సౌత్‌ సర్కిల్లో 12, ల్యాంకోహిల్స్‌, రాజేంద్రనగర్‌, అల్మాస్‌గూడ, వనస్థలిపురం పరిధిలోని ఫీడర్లు దెబ్బతిని కరెంటు ఆగిపోయింది. కొన్నిచోట్ల ఉదయానికి పునరుద్ధరించారు. లాక్‌డౌన్‌ వల్ల కూలీలు లేకపోవడంతో పునరుద్ధరణ ఆలస్యమై గురువారం మధ్యాహ్నం వరకు కొన్నిచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

పలు ప్రాంతాల్లో వర్షపాతం (సెం.మీ.లలో)

కార్వాన్‌ 2.46

ఫలక్‌నుమా  2.11

మెహిదీపట్నం 1.7

జూబ్లీహిల్స్‌ 1.36

చాంద్రాయణ గుట్ట 1.35

గోషామహల్‌ 1.3

హయత్‌నగర్‌ 0.9

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని