తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
వ్యాపారంలో వాటా వద్దన్నారని అసభ్య సందేశాలు

రాజీకి రూ. కోటి ఇవ్వాలంటూ బెదిరింపులు


నిందితుడు సురేష్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: వ్యాపార భాగస్వామ్యం పేరుతో ఓ కుటుంబాన్ని వేధిస్తున్న వ్యక్తిని హైడ్రామా తరువాత జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్‌లో నివసించే అట్లూరి సురేష్‌ జూబ్లీహిల్స్‌లో తనకు పరిచయమున్న ఓ కుటుంబంతో వ్యాపార భాగస్వామ్యం పేరిట దగ్గరయ్యాడు. సురేష్‌ ప్రతిపాదనను ఆ కుటుంబం తిరస్కరించడంతో కోపం పెంచుకున్న అతను తరచూ ఆ కుటుంబ సభ్యులకు అర్ధరాత్రుళ్లు ఫోన్లు చేయడం, సందేశాలు పంపేవాడు. వారిలో ఓ యువతి(19)కి అసభ్యకరమైన సందేశాలను పంపాడు. తనతో కలిసి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకుంటే ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. రాజీ చేసుకోవాలంటే రూ.కోటి ఇవ్వాలని బెదిరించాడంటూ ఆ కుటుంబంలోని ఓ మహిళ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసులు నమోదు చేశారు. అరెస్టు చేయడానికి బుధవారం మాదాపూర్‌లో ఉన్న అతడి అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. లోపల తాళం వేసుకున్న అతను సోషల్‌ మీడియాలో వీడియోలు పెట్టాడు. తనను చంపేస్తారంటూ పేర్కొన్నాడు. 20 గంటలకు పైగా వేచిఉన్న పోలీసులు గురువారం ఉదయం అతన్ని అరెస్ట్‌ చేశారు. గతంలో సురేష్‌, అతడి భార్య ఓ కేసు విషయంలో బంజారాహిల్స్‌ పోలీసులపై ఆరోపణలు చేశాక పొరపాటయిందంటూ వీడియోలు పెట్టారు. ఇతడిపై ఏపీలోనూ, నగరంలోనూ పలు కేసులు నమోదై ఉన్నాయి.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని