తాజా వార్తలు

Updated : 04/05/2021 16:26 IST
Eatala: భూ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూముల్లో ప్రభుత్వం సర్వే జరిపిన తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. సర్వే చేసే ముందు నోటీసు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సహజ న్యాయసూత్రాలను అధికారులు తీవ్రంగా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జమున హేచరీస్‌ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో ఈటల కుటుంబం దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈటల తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి.. ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈ విషయంలో అధికారులు చట్టప్రకారం వ్యవహరించవచ్చునని హైకోర్టు వ్యాఖ్యానించింది. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ నివేదికను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. కలెక్టర్ నివేదికతో సంబంధం లేకుండా చట్టప్రకారం వ్యవహరించాలని సూచించింది. చట్టప్రకారం నోటీసులు ఇచ్చి తగిన సమయం ఇవ్వాలని ఆదేశించింది. విచారణకు సహకరించేలా పిటిషనర్లను ఆదేశించాలని ఏజీ కోరగా.. వారు సహకరించకపోతే చట్టప్రకారం వ్యవహరించవచ్చని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేసింది.

 

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని