తాజా వార్తలు

Updated : 04/05/2021 12:04 IST
దేవరయాంజల్‌ భూములను పరిశీలించిన కలెక్టర్‌

శామీర్‌పేట‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారంలో భాగంగా మేడ్చల్‌ జిల్లా దేవరయాంజల్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ భూములను జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి పరిశీలించారు. దేవాలయ భూముల ఆక్రమణల ఆరోపణలపై ఐఏఎస్‌లతో ప్రభుత్వం నియమించింది. దీంతో పాటు ఏసీబీ, విజిలెన్స్‌ దర్యాప్తునకూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ ఆధీనంలో ఉన్న భూముల్లో గోదాంలను జిల్లా కలెక్టర్‌తో పాటు రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు పరిశీలించారు. 

దేవరయాంజల్‌లోని దేవాదాయ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విచారణకు ఆదేశించింది. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి 1,521 ఎకరాల 13 గుంటల భూమి ఉందని దేవాదాయ శాఖ చెబుతోందని, ఇందులో పెద్ద ఎత్తున ఆక్రమణలు, అక్రమ భూ బదలాయింపులు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో ఎసైన్డ్‌ భూములను ఈటల, ఆయన అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై ముఖ్యమంత్రి విచారణ జరిపించడం, ఆక్రమణలు వాస్తవమేనని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ నిర్ధారించడం, మంత్రి పదవి నుంచి ఈటలను బర్తరఫ్‌ చేసిన విషయం తెలిసిందే. 

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని