తాజా వార్తలు

Published : 14/06/2021 06:07 IST
కొవిడ్‌తో ముప్పాళ్ల సోదరుని మృతి

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు నాలుగో సోదరుడు ముప్పాళ్ల రమేశ్‌(55) కొవిడ్‌తో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మృతి చెందినట్లు సీపీఐ జిల్లా కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రమేశ్‌ సతీమణి పుష్పరాణి 36 రోజుల కిందట కొవిడ్‌తో మరణించారు. కొద్ది రోజుల క్రిత ఆయనకూ కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూ ఆయన కూడా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ముప్పాళ్ల రమేశ్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారి మృతి పట్ల సీపీఐ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని