తాజా వార్తలు

Published : 14/06/2021 06:07 IST
ఆటో బోల్తా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు

గాయాలపాలైన అలివేలు

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: ఆటో బోల్తాపడి ఎనిమిది మందికి తీవ్రగాయాలైన సంఘటన మాచర్ల మండలం కొత్తపల్లి శివారు ద్వారకాపురి వద్ద ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొప్పునూరు గ్రామానికి చెందిన గుర్రపు అలివేలు, చినలచ్చమ్మ, మల్లేశ్వరి, పెదలక్ష్మమ్మ, నాగలక్ష్మి, రామకోటమ్మ, లక్ష్మమ్మ, రమణ వెల్దుర్తి మండలం గంగలకుంటకు వెళ్లి స్వగ్రామానికి ఆటోలో తిరిగి పయనమయ్యారు. లచ్చంబావితండా మీదుగా వస్తుండగా ద్వారకాపురి వద్దకు వచ్చేలోగా ఆటోబ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో ఆటోబోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన ఎనిమిదిమందిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. విజయపురిసౌత్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

చినలచ్చమ్మ, మల్లేశ్వరి​​​​​​​

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని