తాజా వార్తలు

Published : 14/06/2021 06:07 IST
త్రికోటేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

కోటప్పకొండలో న్యాయమూర్తి జస్టిస్‌

విజయలక్ష్మికి స్వాగతం పలుకుతున్న అర్చకులు

నరసరావుపేట లీగల్‌, గ్రామీణ నరసరావుపేట, న్యూస్‌టుడే: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయలక్ష్మి కుటుంబ సమేతంగా ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. న్యాయమూర్తి వెంట మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి మాధురి, గ్రామీణ సీఐ అచ్చయ్య, ఎస్సై లక్ష్మీనారాయణరెడ్డి తదితరులున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని