తాజా వార్తలు

Published : 14/06/2021 06:07 IST
ఇసుక తవ్వకాలు తక్షణం ఆపండి : పీసీసీ

తుళ్లూరు, న్యూస్‌టుడే: కృష్ణా నదిలోని లంక భూములకు పెనుముప్పుగా మారనున్న ఇసుక తోడకం పనులు(డ్రెజ్జింగ్‌) తక్షణమే నిలుపుదల చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి చిలకా విజయ్‌కుమార్‌ కోరారు. అమరావతిలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కాంగ్రెస్‌ నాయకులు ఆదివారం పర్యటించారు. తాళ్లాయపాలెం పరిధిలోని కృష్ణానదీ తీరంలో పెద్దఎత్తున కొనసాగుతున్న ఇసుక తోడకం పనులు పరిశీలించారు. గతంలో వైకాపా నాయకులు ఇక్కడేదో అన్యాయం జరిగిపోతుందంటూ గగ్గోలు పెట్టి, నేడు అదే ప్రాంతంలో ఇసుక తోడకానికి ఎలా అనుమతులు మంజూరు చేశారంటూ విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. దళితులు సాగు చేసుకొంటున్న లంకభూములు కోతకు గురై వారంతా నష్టపోతారని ఇప్పకైనా ప్రభుత్వం గమనించి డ్రెజ్జింగ్‌ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు నెలనెలా పంపిణీ చేస్తున్న రూ.2,500 అమరావతి పింఛను రూ.5వేలుగా ఇస్తామన్న మాటను మరిచిపోయారని విమర్శించారు. పార్టీ నాయకులు కొమ్మినేని సురేష్‌, కొల్లా బాబు, మెండెం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని