తాజా వార్తలు

Published : 17/05/2021 05:56 IST
ఆటంకాలు ఎదురైనా ‘అమరావతి’ని సాధిస్తాం

నిరసన తెలిపిన రైతులు

తుళ్లూరులో మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు, చిన్నారులు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: అమరావతిని కొనసాగించి న్యాయం చేయమని అడితే కేసులు పెట్టి వేధించడం దారుణమని ఆదివారం పెదపరిమి శిబిరంలో నిరసన తెలుపుతున్న రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కోసమే రైతులు త్యాగాలు చేశారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరాడి అమరావతిని సాధించుకుంటామన్నారు. దీనికి అండగా నిలుస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వైకాపా నుంచి ఒకే ఒక్కడు అమరావతి పరిరక్షణకు నడుంకడితే ఆయన్ను కేసులతో వేధించడం దారుణమని మండిపడ్డారు. పెద్దపెట్టున నినాదాలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో చేస్తున్న నిరసనలు 516వ రోజుకు చేరిన నేపథ్యంలో తుళ్లూరులో పలువురు మహిళలు, పిల్లలు మొక్కలను నాటి నిరసన వ్యక్తం చేశారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని