తాజా వార్తలు

Published : 17/05/2021 05:56 IST
లాక్‌డౌన్‌లో పోలీసుల చేతివాటం


డబ్బులు వసూలు చేస్తున్న పోలీసులు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ పోలీసు శాఖలో కొందరికి ఆదాయ వనరుగా మారింది. పట్టణంలో మధ్యాహ్నం 12 గంటలకు దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. తర్వాత ఎవరూ బయటకు రావద్దని సూచించారు. అయితే అత్యవసర పనులపై వచ్చే ప్రజలను నిలిపి పోలీసులు అందినకాడికి గుంజుకుంటున్నారు. ఆయా పోలీసు స్టేషన్లపరిధిలో కొందరు సిబ్బంది ప్రధాన రహదారుల్లో మకాం వేసి రెండు వాహనాలకు చలానా రాస్తే ఐదు వాహనాలను అనధికారికంగా ముడుపులు తీసుకుని పంపుతున్నారు. గత నాలుగు రోజులుగా ఇదే తంతు రహదారులపై కొనసాగుతోంది. కొందరు సిబ్బంది ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ద్విచక్ర వాహనాలకు 300, కార్లకు 500 అనధికారికంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ‘న్యూస్‌టుడే’ డీఎస్పీ విజయభాస్కరరావు దృష్టికి తీసుకెళ్లగా విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని