తాజా వార్తలు

Updated : 19/04/2021 10:26 IST
ఆశ్రయమిచ్చి అక్క, చెల్లెలిని వేధించి..

సర్పవరం జంక్షన్‌(తూర్పు గోదావరి): ఆర్థిక ఇబ్బందులు కారణంగా అక్కాచెల్లెలు ఇద్దరూ పరిచయస్తుల ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. వారిపట్ల మంచితనంగా ఉన్న ఆ ఇంటి యజమాని అసలు స్వరూపం బయటపడింది. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. తాము చదువుకునేందుకు ఆశ్రయం కల్పించి అండగా ఉంటాడనుకున్న వ్యక్తి వికృత చేష్టలకు భయపడిన ఆ ఇద్దరు యువతులూ సొంత గ్రామానికి వచ్చేశారు. బాధిత యువతుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిమ్మాపురం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. ఎస్సై విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ గ్రామీణంలోకి ఓ గ్రామానికి చెందిన 28, 24 ఏళ్ల అక్కాచెల్లెలు కాకినాడ అశోక్‌నగర్‌లో ఉంటున్న మడికి రాజేశ్వరదయాళ్‌, రెండో భార్య స్వాతి వద్ద సుమారు 10 ఏళ్లుగా ఉంటూ చదువుకుంటున్నారు. కొంత కాలంగా రాజేశ్వరదయాళ్‌ ఇద్దరు యువతులనూ వేధిస్తూ.. పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నాడు. తన మాట వినకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అతడి చర్యలను రెండో భార్య కూడా సహకరిస్తోంది. భార్యాభర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని